News August 28, 2025
బెల్లంపల్లిలో సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు ఛైర్‌పర్సన్ పర్యటన

బెల్లంపల్లి, బల్లార్షా రైల్వే సెక్షన్ల మధ్య నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్‌ను గురువారం సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు ఛైర్‌పర్సన్ మాధవీలత ప్రారంభించారు. థర్డ్ లైన్‌ను పర్యవేక్షించే అధికారులకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు చేపట్టిన థర్డ్ లైన్ ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
Similar News
News August 29, 2025
గుంటూరులో భారీ వర్షాలు.. సగటు 40.6 మి.మీ.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు అత్యధికంగా దుగ్గిరాలలో 58.6 మి.మీ, కనిష్టంగా మేడికొండూరులో 15.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకానిలో 57, చేబ్రోలు 48.4, ప్రత్తిపాడు 48.2, గుంటూరు పశ్చిమ 46.2, తాడేపల్లి 45.6 మి.మీ. వర్షం కురిసింది. పొన్నూరులో 22.6 మి.మీ. నమోదు. జిల్లాలో ఇప్పటి వరకు 276.8 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణాన్ని మించిపోయింది.
News August 29, 2025
ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా: పవన్

ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కార్యకర్తను ఉద్ధేశించి మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. కార్యకర్తల ఇంటిలో ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలను తెలుసుకోవాలని గాజువాకకు చెందిన జనసేన కార్యకర్త సురేశ్ కుమార్ పవన్‌ను కోరారు. ఈ ఆలోచన నచ్చడంతో ఈసారి విశాఖ వస్తే సురేశ్ ఇంట్లోనే నిద్ర చేస్తానంటూ నిన్న జరిగిన సమావేశం అనంతరం పవన్ అన్నారు.
News August 29, 2025
సంగారెడ్డి: 3,740 ఎకరాల పంట నష్టం

మూడు రోజులగా కురిసిన భారీ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లాలో 3,740 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పంట నష్టం ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు.