News August 28, 2025
బయ్యారం: పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్

రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బయ్యారంలోని పెద్ద చెరువును గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 29, 2025
NZB: కృష్ణా ఎక్స్ ప్రెస్ రద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లాలో రైల్వే పట్టాలు కింద ఉన్న కంకర, మట్టి వరదతో కొట్టుకుపోయి రైల్వే లైన్ దెబ్బతింది. దీంతో శుక్రవారం తిరుపతి నుంచి ఆదిలాబాద్ రావాల్సిన కృష్ణా ఎక్స్ ప్రెస్(ట్రైన్ నంబర్ 17405)ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
News August 29, 2025
WGL: కృష్ణా ఎక్స్ ప్రెస్ రద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లాలో రైల్వే పట్టాల కింద ఉన్న కంకర, మట్టి వరదతో కొట్టుకుపోయి రైల్వే లైన్ దెబ్బతింది. దీంతో శుక్రవారం తిరుపతి నుంచి ఆదిలాబాద్ రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 17405)ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
News August 29, 2025
NLG: పోలీసుల అదుపులో అనుమానితులు?

నల్గొండలో యువకుడి మర్డర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. మృతుడు రమేశ్ బావ బుషిపాక వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలు తీసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.