News August 28, 2025
మందమర్రి: సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన మహిళ

సైబర్ నేరగాళ్ల మోసానికి గురైన ఓ మహిళ రూ.6.37 లక్షలను పోగొట్టుకున్నట్లు SI రాజశేఖర్ చెప్పారు. SI తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో THAW and REPAIR ప్రకటన చూసి పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి, సంబంధిత టెలిగ్రామ్ యాప్‌లో చేరింది. మొదటగా బాధితురాలి ఖాతాలో రూ.5 వేలు జమైనట్లు చూపించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా రూ.6.37 లక్షలు పెట్టి, పోగొట్టుకుంది.
Similar News
News August 29, 2025
ఏడు పదుల వయసులో పద్యానికి ప్రాణం పోస్తూ

తెలుగు భాషను బతికించి భావితరాలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో 76 వయసులో గుంటూరుకు చెందిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ తనదైన శైలిలో సేవ చేస్తున్నారు.’తెలుగు కావ్య మథనం” పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి పద్యరచనపై శిక్షణ ఇస్తున్నారు. 2019 నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, వ్యాపారాల్లో ఉన్న భాషాభిమానులంతా సభ్యులుగా చేరారు. 2025లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.
News August 29, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా వైదొలిగిన రోజర్ బిన్నీ!

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వైదొలిగినట్లు తెలుస్తోంది. బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండినవారు ప్రెసిడెంట్‌గా ఉండటానికి వీళ్లేదు. దీంతో ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు సమాచారం. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా వ్యవహరిస్తున్నారు.
News August 29, 2025
ఆదిత్యుని ఆలయం మూసివేత

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున స్వామి వారికి నిత్యార్చనాలు, నివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయాన్ని మూసివేసి, 8న ఉదయం తెరిచి సంప్రోక్షణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉ. 7:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.