News August 28, 2025
మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్

AP: ఉచిత బస్సు ప్రయాణం విషయంలో చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచారని YS జగన్ ఆరోపించారు. ‘11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణమా? అమ్మఒడి తొలి ఏడాది ఇవ్వలేదు. 87 లక్షల మంది పిల్లల్లో 30 లక్షల మందికి ఇవ్వడం లేదు. మహిళలకు మేం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ఉచిత సిలిండర్ల పథకానికి ₹4,100 కోట్లు అవసరమైతే ₹747 కోట్లే ఇచ్చారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’ అని Xలో జగన్ ఫైరయ్యారు.
Similar News
News August 29, 2025
పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ

AP: టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వీరికి నేర చరిత్ర ఉందని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా మాచర్ల నియోజకవర్గం ముదిలవీడు సమీపంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యలకు వీరు కుట్ర పన్నారని కేసు నమోదైంది.
News August 29, 2025
త్వరగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలి: సీతక్క

TG: రాష్ట్రంలో 1,291 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పంచాయితీరాజ్ రోడ్లపై ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వర్షాలకు రూ.374 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.22.71 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.352 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. 14 గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాం. త్వరగా రోడ్లకు మరమ్మతులు ప్రారంభించాలి’ అని ఆదేశించారు.
News August 29, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా వైదొలిగిన రోజర్ బిన్నీ!

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వైదొలిగినట్లు తెలుస్తోంది. బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండినవారు ప్రెసిడెంట్‌గా ఉండటానికి వీళ్లేదు. దీంతో ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు సమాచారం. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా వ్యవహరిస్తున్నారు.