News August 28, 2025
నిజాంసాగర్: 27 గేట్లు ఎత్తి.. 2.20 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు 1,80,038 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి 2,20,256 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 15.847 టీఎంసీలకు చేరింది. నీటి ప్రవాహం పెరిగినందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News August 29, 2025
ఫించన్‌కు జిల్లా వ్యాప్తంగా 3,900 మంది అప్పీలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్‌కు అనర్హలుగా నోటీసులు అందుకున్న వారికి ప్రభుత్వం అప్పీలుకు అవకాశం కల్పించింది. ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద ఇప్పటి వరకు అప్పీలు చేసుకొన్న వారికి సెప్టెంబర్ 1వ తేదీన యాథావిథిగా పింఛన్ నగదు చెల్లించనున్నారు. జిల్లాలో 6,480 మంది నోటీసులు అందుకోగా, ఇప్పటివరకు 3,900 మంది అప్పీలు చేసుకొన్నట్లు DRDA పీడీ శోభన్ బాబు తెలిపారు.
News August 29, 2025
JGTL: ఏడాది క్రితం మిస్సింగ్.. 2రోజుల క్రితం అస్థిపంజరం లభ్యం

మెట్‌పల్లి మం. రాజేశ్వరరావుపేటకి చెందిన విద్యార్థి నోముల రిశ్వంత్ ఏడాది క్రితం తప్పిపోగా 2రోజుల క్రితం అస్థిపంజరంగా కేదార్నాథ్‌లో లభ్యం కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. రిశ్వంత్ పంజాబ్లోని ఓ యూనివర్సిటీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. గతేడాది AUGలో ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ, కళాశాలకు చేరకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News August 29, 2025
అమరావతికి కనెక్టివిటీని పెంచేలా NH-65 విస్తరణ

అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు NH-65 విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. హైదరాబాద్-విజయవాడ రహదారి అమరావతికి అనుసంధానం అయితే ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, వాణిజ్యం వృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని పలువురు అంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదన జరుగుతుంది.