News August 28, 2025
భీమవరంలో వచ్చే నెల 2న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన

సారధ్యం యాత్రలో భాగంగా వచ్చే నెల 2న భీమవరం వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చాయ్ పే చర్చ కార్యక్రమంతోపాటు పట్టణంలో శోభాయాత్ర, బీజేపీ జిల్లా విస్తృత స్థాయి జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారన్నారు.
Similar News
News September 1, 2025
నేత్రదానంపై అవగాహన పెంచాలి: కలెక్టర్ నాగరాణి

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, ఇది ఒక గొప్ప దానమని ఆమె పేర్కొన్నారు.
News September 1, 2025
భీమవరం: పీజీఆర్ఎస్‌కు 210 అర్జీలు

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి 210 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News September 1, 2025
ఆకివీడులో పెన్షన్ పంపిణీ చేసిన జేసీ

ఆకివీడు (M) దుంపగడపలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. సిబ్బంది పెన్షన్ సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు సక్రమంగా అందజేయకపోవడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.