News August 28, 2025

WNP: భూభారతి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

image

భూభారతిలో పెండింగ్‌లో ఉన్న రైతు అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మండల తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News August 29, 2025

HYD: నిందితుడి కస్టడీకి పోలీసుల పిటిషన్

image

కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉండగా.. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.

News August 29, 2025

మర్డర్ కేసు ఛేదించిన నల్గొండ పోలీసులు

image

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్‌ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్‌లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

News August 29, 2025

HYD: బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై సూర్యకిరణాలు

image

HYD శివారు శంకర్‌పల్లిలోని చందిప్ప గ్రామంలో గల 11వ శతాబ్దపు శ్రీరాముడు ప్రతిష్ఠించిన పురాతన బ్రహ్మసూత్ర మరకత శివలింగంపై శుక్రవారం ఉదయం సూర్య కిరణాలు పడ్డాయి. ఆలయ అర్చకుడు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శివలింగంపై సూర్య కిరణాలు పడటం చాలా అరుదని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.