News August 28, 2025

తిరుపతి: బాలికపై అత్యాచారం.. 26 ఏళ్ల జైలుశిక్ష

image

తిరుపతి జిల్లా చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన కన్నా శ్రీనివాసులు(21) మైనర్ బాలికపై కన్నేశాడు. 2021 జులై 14న బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికను శ్రీనివాసులు కిడ్నాప్ చేసి వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి 26ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి సుమ గురువారం తీర్పు చెప్పారు.

Similar News

News August 29, 2025

రాజమండ్రి: విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురు అరెస్ట్

image

మోరంపూడిలోని శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI కాశీ విశ్వనాథ్ వివరాలు.. పాఠశాలలోని CC కెమెరాలను సహచర విద్యార్థులు తొలగించి దాచుకున్నారని విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై ఈ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థుల్ని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. ప్రిన్సిపాల్, హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్‌ను అరెస్ట్ చేశారు.

News August 29, 2025

నగరి: అబార్షన్ వికటించి నర్సింగ్ అమ్మాయి మృతి

image

ఓ నర్సు తప్పిదంతో 17 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన ఇది. నగరి(M) పళ్లిపట్టు సమీప గ్రామానికి చెందిన అమ్మాయి నర్సింగ్ చదువుతూ అదే ఊరికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఆమె గర్భం దాల్చగా నగరి సమీపంలోని పన్నూరుకు తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తిరువళ్లూరకు తీసుకెళ్తుండగా దారి మధ్యలో చనిపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి వరుసకు అన్న అయినట్లు సమాచారం.

News August 29, 2025

డేటా సెంటర్లకు కేంద్రంగా విశాఖ తీరం

image

AP: విశాఖ తీరం డేటా సెంటర్లకు అడ్డాగా మారనుంది. ₹50వేల కోట్లకు పైగా పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా, అంతకుముందే ₹14,634 కోట్లతో అదానీ సంస్థ, నెల క్రితం సిఫీ టెక్నాలజీస్ కూడా ₹16,466 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ₹81వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్లతో ప్రత్యక్షంగా వేలమందికి, పరోక్షంగా లక్ష మందికి ఉక్కు నగరంలో ఉపాధి దక్కనుంది.