News August 28, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

TG: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న ఆయన రిటైర్ కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో సర్వీసును 7 నెలలు పొడిగించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.
Similar News
News August 29, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 29, 2025
పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ

AP: టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వీరికి నేర చరిత్ర ఉందని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా మాచర్ల నియోజకవర్గం ముదిలవీడు సమీపంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యలకు వీరు కుట్ర పన్నారని కేసు నమోదైంది.
News August 29, 2025
త్వరగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలి: సీతక్క

TG: రాష్ట్రంలో 1,291 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పంచాయితీరాజ్ రోడ్లపై ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వర్షాలకు రూ.374 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.22.71 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.352 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. 14 గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాం. త్వరగా రోడ్లకు మరమ్మతులు ప్రారంభించాలి’ అని ఆదేశించారు.