News August 28, 2025
అల్లర్లు రేకెత్తించే పాటలు పెడితే చర్యలు: ఎస్పీ

వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గురువారం వినాయక కమిటీ సభ్యులకు ఆయన తగు సూచనలు చేశారు. నిమజ్జన సమయాలలో డీజే, అసభ్యకర నృత్య ప్రదర్శనలు, అల్లర్లు సృష్టించే పాటలు పెట్టరాదన్నారు. పోలీస్ శాఖ వారు సూచించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే వినాయక నిమజ్జనాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News August 29, 2025
సికింద్రాబాద్-వాడి మధ్య మరో 2 ట్రాకులు

TG: రాష్ట్రంలో తొలి 4లైన్ల అంతర్రాష్ట్ర రైలుమార్గం రూపుదిద్దుకోనుంది. రూ.5,012 కోట్లతో సికింద్రాబాద్(సనత్‌నగర్)-వాడి మధ్య 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు 2026 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. డబుల్ ట్రాక్‌గా ఉన్న ఈ రూటును 4 లైన్లుగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. తాజా నిర్ణయంతో ఈ రూట్లో కొత్త రైళ్లు వచ్చే అవకాశముంది.
News August 29, 2025
రాజమండ్రి: విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురు అరెస్ట్

మోరంపూడిలోని శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI కాశీ విశ్వనాథ్ వివరాలు.. పాఠశాలలోని CC కెమెరాలను సహచర విద్యార్థులు తొలగించి దాచుకున్నారని విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై ఈ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థుల్ని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. ప్రిన్సిపాల్, హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్‌ను అరెస్ట్ చేశారు.
News August 29, 2025
నగరి: అబార్షన్ వికటించి నర్సింగ్ అమ్మాయి మృతి

ఓ నర్సు తప్పిదంతో 17 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన ఇది. నగరి(M) పళ్లిపట్టు సమీప గ్రామానికి చెందిన అమ్మాయి నర్సింగ్ చదువుతూ అదే ఊరికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఆమె గర్భం దాల్చగా నగరి సమీపంలోని పన్నూరుకు తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తిరువళ్లూరకు తీసుకెళ్తుండగా దారి మధ్యలో చనిపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి వరుసకు అన్న అయినట్లు సమాచారం.