News April 2, 2024
ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలి : జిల్లా కలెక్టర్

సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం పింఛన్ల పంపిణీపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4,5 తేదీల్లోపు పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు.
Similar News
News January 13, 2026
రైతులకు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రైతులు పంట సాగులో ఎదుర్కొంటున్న పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఖరీఫ్ 2026, రబీ 2026-27 పంటలకు కూలీ ఖర్చులు, పెట్టుబడులు, గతేడాది ధరలను పరిగణలోకి తీసుకొని రుణ పరిమితులు నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
కర్నూలు: 95 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మెగా కీలు అందజేశారు. టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరిలో మరో 500 గృహాలు అందజేస్తామన్నారు.


