News August 29, 2025

సంగారెడ్డిలో హెల్ప్‌లైన్ నంబరం 08455- 276155

image

సంగారెడ్డి కలెక్టరేట్‌లో అత్యవసర సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణ సహాయం కోసం అత్యవసర నంబర్ 08455 – 276155 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఫోన్ చేయవచ్చని, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని కలెక్టర్ సూచించారు.

Similar News

News August 29, 2025

ఆరిలోవ: నడిరోడ్డుపై నిప్పంటిచుకున్నాడు

image

విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

News August 29, 2025

దివ్యాంగులకు ఉచిత పరికరాల క్యాంపు: కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఉచిత పరికరాల నిర్ధారణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు. ఈ శిబిరానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల ఉపకరణాల సంస్థ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా అందించనున్నారు.

News August 29, 2025

MBNR: కొత్తపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 85.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్జిల్ 63.3, జడ్చర్ల 34.3 మహబూబ్ నగర్ అర్బన్ 21.5, భూత్పూర్ 19.5, చిన్నచింతకుంట 13.3, కౌకుంట్ల 10.5, కోయిలకొండ మండలం పారుపల్లి 10.0, బాలానగర్ 8.5, మూసాపేట 5.8, దేవరకద్ర, హన్వాడ 3.8, మిల్లీమీటర్ల వాన పడింది.