News August 29, 2025
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలి: DGP

నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 29, 2025
నెల్లూరు: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన శ్రీనివాసులు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేసిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.
News August 29, 2025
ఆ విషయంలో నెల్లూరు జిల్లా టాప్..!

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని DGP హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మిస్సింగ్ కేసులు చేధనలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని నెల్లూరు జిల్లా పోలీసులను అభినందించారు. ప్రజలల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించి, భద్రత, భరోసా, నమ్మకంగా కలిగించేలా విధులు నిర్వహించాలని సూచించారు.
News August 29, 2025
త్వరగా భూసేకరణ చేయండి: నెల్లూరు కలెక్టర్

జిల్లాలో అవసరమైన భూసేకరణను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ల్యాండ్ ఎక్విజిషన్‌పై సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. నడికుడి- శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వివరాలు తెలుసుకున్నారు. భూమిని ఇచ్చిన వారికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు.