News August 29, 2025

జనగామ: యాంకర్ లోబోకు జైలు శిక్ష

image

యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రఘునాథపల్లి ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. 2018లో రఘునాథపల్లి మండలంలో అతివేగంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది.

Similar News

News August 29, 2025

ఓటరు డ్రాఫ్ట్ జాబితా రిలీజ్.. మీ పేరు ఉందా?

image

TG: గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటరు డ్రాఫ్ట్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మీ జిల్లా, మండలం, గ్రామం వివరాలతో <>లిస్ట్<<>> పొందవచ్చు. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు రేపటి వరకు అధికారులు అవకాశమిచ్చారు. ఈ నెల 31న DPO పరిశీలించి, సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

News August 29, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

News August 29, 2025

సీఎం పర్యటన మళ్లీ వాయిదా

image

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.