News August 29, 2025

BREAKING: చెక్ పోస్టులన్నీ రద్దు

image

TG: రవాణాశాఖ ఆధ్వర్యంలోని 14 బార్డర్ చెక్‌పోస్టులు, కామారెడ్డిలోని RTA చెక్ పోస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, అనవసరంగా ఆపడాలు వంటివి తగ్గి వాహనాలు వేగంగా కదులుతాయి. సమయం, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో వాహన పర్మిట్లను వాహనదారులు ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ స్క్వాడ్ ద్వారా RTA అధికారులు పర్మిట్లను తనిఖీ చేస్తారు.

Similar News

News August 29, 2025

బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు: IMD

image

ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న AP, TGకి IMD బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో SEP 3 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి బెంగాల్, ఒడిశా తీరాల మీదుగా SEP 5 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. అటు SEP రెండో వారంలో వాయవ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో భారీ వర్షాలు కురవనున్నాయి.

News August 29, 2025

స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం

image

తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు తమిళ స్టార్ హీరో విశాల్ వెల్లడించారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వేడుక ఫొటోలను పంచుకున్నారు.

News August 29, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.