News August 29, 2025
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్

అమెరికా టారిఫ్ ఆంక్షలు విధించినా భారత్ మాత్రం వెనుకడుగు వేయట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు మరింత పెంచేందుకు సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆగస్టుతో పోల్చితే వచ్చే నెలలో 10-20% అదనంగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడులతో మాస్కోలో రిఫైనరీలు దెబ్బతినగా ధరలు కూడా తగ్గే అవకాశమున్నట్లు సమాచారం. పశ్చిమదేశాల ఆంక్షలతో రష్యాకు భారత్ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుగా మారింది.
Similar News
News August 29, 2025
స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం

తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు తమిళ స్టార్ హీరో విశాల్ వెల్లడించారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వేడుక ఫొటోలను పంచుకున్నారు.
News August 29, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 29, 2025
పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ

AP: టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వీరికి నేర చరిత్ర ఉందని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా మాచర్ల నియోజకవర్గం ముదిలవీడు సమీపంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యలకు వీరు కుట్ర పన్నారని కేసు నమోదైంది.