News August 29, 2025

ADB: వినాయకుడిని దర్శించుకున్న గోమాత

image

భీంపూర్ మండలం అంతర్గాంలో త్రినేత్ర గణేష్ మండలి వద్ద హారతి తర్వాత ఓ విచిత్ర ఘటన జరిగింది. అటుగా వచ్చిన ఓ ఆవు, దాని దూడ వినాయకుడి విగ్రహం ముందు నిలబడి భక్తితో చూస్తున్నట్లు కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువకులు వాటికి నైవేద్యం సమర్పించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్వతి పుత్రుడు గణపతిని మురిపెంగా చూస్తూ ఆవు దూడలు అలా దర్శనం చేసుకుంటున్నట్లు కనిపించాయి.

Similar News

News August 29, 2025

స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం

image

తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్షికతో నిశ్చితార్థం జరిగినట్లు తమిళ స్టార్ హీరో విశాల్ వెల్లడించారు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధన్షికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. వేడుక ఫొటోలను పంచుకున్నారు.

News August 29, 2025

HYD: తోక జాడించకండి.. మిమ్మల్నే చూస్తున్నారు!

image

ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు నగరంలోని అనేక మండపాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇదే అదునుగా పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో HYD షీ టీమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అసభ్యంగా తాకినా, వేధింపులకు పాల్పడినా 100, 112, 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

News August 29, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.