News August 29, 2025

వరంగల్: ఇంటర్ పూర్తి చేసిన వారికి శుభవార్త

image

HCL టెక్నాలజీస్ ఆధ్వర్యంలో HCL TECH Bee జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-2025లో ఇంటర్ పూర్తి చేసుకున్న వారు MPC, MEC, CEC, BIPC, Vocational Computers పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన హనుమకొండలోని ICSS కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో జాబ్ మేళా ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News September 1, 2025

వనపర్తి: మరమ్మతు పనులు పూర్తి చేయాలి: CM

image

ఇటీవల ఆయా జిల్లాలో కురిసిన భారీవర్షాల నేపథ్యంలో నష్టపోయిన వివిధ శాఖల పరిధిలోని మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి 25డ్యామేజీలు జరిగాయని, ఇప్పటివరకు ఆరింటికి మరమ్మతులు పూర్తి చేశామన్నారు.

News September 1, 2025

GWL: 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు: DAO

image

గద్వాల జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణలో సన్న, చిన్న కారు రైతులకు 50 శాతం సబ్సిడీతో వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాకు రూ.2.24 కోట్లు నిధులు కేటాయించి 2,703 యూనిట్ల పనిముట్లు మంజూరు చేసిందన్నారు. పథకానికి SC, ST మహిళా రైతులు, చిన్న, సన్న కారు రైతులు అర్హులన్నారు. ఆసక్తి గల రైతులు ఏవోలను సంప్రదించాలన్నారు.

News September 1, 2025

మరో 24 గంటల్లో అల్పపీడనం: APSDMA

image

AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.