News August 29, 2025
క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ప్లేయర్లు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2 వాంగ్(చైనా)పై సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మెన్స్ డబుల్స్‌లో చిరాగ్, సాత్విక్ ద్వయం చైనా జోడీ లియాంగ్, వాంగ్ చాంగ్‌పై జయకేతనం ఎగురవేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. మరోవైపు రౌండ్-2లోనే లక్ష్యసేన్ పోరు ముగిసింది.
Similar News
News September 1, 2025
పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటు: TDP

AP: సూపర్ సిక్స్ సంక్షేమమే కాదు, అభివృద్ధిలోనూ రాష్ట్రం సూపర్‌గా దూసుకెళ్తోందని టీడీపీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో జీఎస్టీ వసూళ్లలో 21శాతం పెరుగుదల నమోదైందంటూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అత్యధిక వృద్ధి రేటని స్పష్టం చేసింది. అదే సమయంలో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఆగస్టులో 12శాతం వృద్ధి సాధించింది.
News September 1, 2025
KTR సంచలన ట్వీట్

TG: కవిత వ్యాఖ్యలకు కౌంటర్‌గా BRS <<17583241>>పోస్ట్<<>> చేసిన హరీశ్ రావు వీడియోను KTR రీట్వీట్ చేశారు. ‘ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ‘KCR ప్రియశిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నా’ అని కొనియాడారు. హరీశ్‌పై కవిత కామెంట్స్ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
News September 1, 2025
YCP నేతలు చీరలు కట్టుకుని బస్సులు ఎక్కాలి: అచ్చెన్న

AP: మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోందో లేదో తెలియాలంటే YCP నేతలు చీరలు ధరించి బస్సులు ఎక్కితే తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను TDP నిలబెట్టుకుందని చెప్పారు. ‘అధికారంలో ఉన్నప్పుడు YCP నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోంది. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం’ అని ఆయన తెలిపారు.