News August 29, 2025

తిరుపతి: 31న టెన్నికాయిట్ జట్ల ఎంపిక

image

తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్, జూనియర్, బాల, బాలికల జట్లు ఎంపిక ఈనెల 31న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు తెలిపారు. నాయుడుపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. జూనియర్ విభాగంలో తలపడే విద్యార్థులు 2007 జనవరి 1న, ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు.

Similar News

News September 1, 2025

MHBD: ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా అధికారులు

image

భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు సోమవారం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జిల్లాలో వర్ష ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ, పంట నష్టాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News September 1, 2025

VKB: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

వికారాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News September 1, 2025

MNCL: ముగిసిన కళా ఉత్సవ పోటీలు

image

మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళా ఉత్సవ పోటీలు సోమవారం ముగిశాయి. జిల్లాలోని దాదాపు 440 మంది విద్యార్థులు 11 అంశాలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్న విద్యార్థులను డీఈఓ యాదయ్య అభినందించారు. జిల్లాలో మొదటి స్థానాన్ని పొందిన విద్యార్థులు త్వరలో రాష్ట్రస్థాయిలో కళా ఉత్సవ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.