News August 29, 2025
ఆ విషయంలో నెల్లూరు జిల్లా టాప్..!

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని DGP హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మిస్సింగ్ కేసులు చేధనలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని నెల్లూరు జిల్లా పోలీసులను అభినందించారు. ప్రజలల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించి, భద్రత, భరోసా, నమ్మకంగా కలిగించేలా విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News September 1, 2025
దారుణంగా రహదారులు.. బిల్లులు ఇవ్వక ఇబ్బందులు

ఏఎంసీ రోడ్ల పనులపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో నెల్లూరు జిల్లాలో కీలక రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. 2022లో 222 రోడ్లను రూ.185.40 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు వచ్చినా, నిధుల సమస్యతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు 51 పనులు మాత్రమే ప్రారంభమై 26 పూర్తి కాగా, 25 ఆగిపోయాయి. మిగతా 171 పనులు అసలు మొదలుకాలేదు. చేసిన పనులకే బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్త పనులు చేయడం లేదు.
News September 1, 2025
కరటంపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఆత్మకూరు మండలం నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కరటంపాడు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్, బైకు ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా, మహిళకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 1, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 436 అర్జీలు : కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 436 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూశాఖకు 174, మున్సిపల్ శాఖకు 41, సర్వేకు 18, పోలీసుశాఖకు 62, సివిల్ సప్లయిస్‌కు 11 అర్జీలు అందాయన్నారు.