News August 29, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని IMD సూచించింది.
Similar News
News August 29, 2025
రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?

TG: రేపటి నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే కాళేశ్వరం రిపోర్టుపై ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత KCR అసెంబ్లీకి హాజరుకాలేదు. రేపు వస్తారో? లేదో? చూడాలి.
News August 29, 2025
రాష్ట్రంలో 1039 కి.మీ. మేర రోడ్లు ధ్వంసం

TG: భారీ వర్షాలకు 37 R&B డివిజన్లలో 1039 కి.మీ.మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ‘794 సమస్యాత్మక రోడ్లు గుర్తించాం. 356 చోట్ల కాజ్ వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 37 చోట్ల రోడ్లు తెగిపోగా.. 10చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశాం. 305 ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోగా, 236 చోట్ల క్లియర్ చేశాం. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1157.46 కోట్లు అవసరం’ అని తెలిపారు.
News August 29, 2025
జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు: షర్మిల

AP: వైఎస్ వివేకానంద హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదు? సునీత ఆరోపణల్లో నిజం ఉంది. CBI తలుచుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేది. జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు. హత్య జరిగిన సమయంలో అవినాశ్ అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.