News August 29, 2025
నేడు డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: డీఈవో

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ)కు అర్హత సాధించిన 230 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ అయ్యాయని విద్యాశాఖ అధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 29న ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్‌తో పాటు, ఒరిజినల్, మూడు అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News September 2, 2025
జగిత్యాల: దొంగతనం కేసులో నిందితుడికి 5 నెలల జైలు

దొంగతనం కేసులలో నిందితుడికి 5 నెలల జైలు శిక్ష పడిన ఘటన జగిత్యాలలో సోమవారం చోటు చేసుకుంది. రెండు దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ కరణ్ సింగ్ గగన్ సింగ్ తక్ అనే నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనిజ కోహ్లీకార్ నిందితుడికి ఐదు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
News September 2, 2025
జగిత్యాల: ‘సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటాం’

CM రేవంత్ రెడ్డితో పెన్షన్ల పెంపు విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ సదస్సును లక్షలాదిమంది పెన్షన్ దారులు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. JGTL(D) రాయికల్ పట్టణంలోని ఓ గార్డెన్‌లో సోమవారం పెన్షన్‌దారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
News September 2, 2025
JGTL: నిబద్ధతతో సేవలందించిన మనోహర్‌కు అభినందనలు

TGNPDCL ఎలక్ట్రిసిటీ ఉద్యోగి దురిశెట్టి మనోహర్ (ADE) ఉద్యోగ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మనోహర్ తన సేవా కాలమంతా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసి శాఖకు ఒక ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, అంకితభావం సిబ్బందికి ప్రేరణగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సహోద్యోగులు, బంధువులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.