News August 29, 2025
అలాంటి ఆసుపత్రుల గుర్తింపు రద్దు: VZM కలెక్టర్

NTR వైద్య సేవల క్రింద వైద్యం పొందుతున్న రోగులకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో NTR వైద్య సేవ సేవలపై సమీక్షించారు. రోగి అడ్మిషన్ కాలంలో చెల్లించిన మొత్తాన్ని డిశ్చార్జ్ రోజునే తిరిగి చెల్లించాలన్నారు. అదనంగా వసూలు చేస్తే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
Similar News
News August 29, 2025
విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్

విజయనగరంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు టర్నింగ్ తిరుగుతుండగా అదుపు తప్పడంతో ఆఖరి రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. గూడ్స్ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు.
News August 28, 2025
VZM: పింఛన్ల పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

ఇటీవల రద్దు చేసిన వికలాంగ పింఛన్ దారులకు ఈ నెల పింఛన్ అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రద్దు చేసిన పింఛన్ దారులకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పీల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు.
News August 28, 2025
VZM: 452 మందిపై కేసులు..రూ. 4.75 లక్షలు ఈ-చలానాలు

హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఆగష్టు 18 నుంచి 24వ తేదీ వరుకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 452 కేసులు నమోదు చేసి రూ.4.75 లక్షల ఈ-చలానాలు విధించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చన్నారు.