News August 29, 2025
SKLM: 30న ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూలు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News September 1, 2025
శ్రీకాకుళం: బాలల హక్కుల పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

జిల్లాలోని బాలబాలికల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బాలల సమస్యలు, పోక్సో చట్టం, మహిళలకు రక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా చిల్డ్రన్ కమిటీలు, ఫిర్యాదుల బాక్స్‌లు, ఈగల్‌క్లబ్స్, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, ప్రొటెక్షన్ కమిటీ ఉండాలన్నారు.
News September 1, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్న

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లా అధికారులను సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి నదులలో ప్రవాహ పరిస్థితులపై మంత్రి అచ్చెన్న అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను కోరారు. గ్రామ స్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని కోరారు.
News September 1, 2025
శ్రీకాకుళం: ఈ ప్రాంతాల్లో ఆరంజ్ అలెర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తన అధికార ఖాతా ద్వారా తెలిపింది. పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.