News August 29, 2025
సీఎం పర్యటన మళ్లీ వాయిదా

సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News September 2, 2025
డిజిటల్ మార్కెటింగ్ ఈ కామర్స్‌పై అవగాహన కల్పిస్తాం: HYD కలెక్టర్

HYD జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు (MSME) డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ (ఆన్‌లైన్) పై అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న మధ్యాహ్నం 2 గంటలకు HYD కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, అలాగే బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా విక్రయ విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
News September 2, 2025
PDPL: ‘గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుట్ర’

మాజీ CM- KCRపై అక్రమ కేసులు బనాయించి, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసి గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు CM రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని BRS రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం నీటితో సోమవారం జలాభిషేకం చేశారు. ఆయన వెంట BRS పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
News September 2, 2025
ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: HYD కలెక్టర్

ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.