News August 29, 2025
ఓటరు డ్రాఫ్ట్ జాబితా రిలీజ్.. మీ పేరు ఉందా?

TG: గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓటరు డ్రాఫ్ట్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మీ జిల్లా, మండలం, గ్రామం వివరాలతో <
Similar News
News September 2, 2025
అలా అయితే హరీశ్ వేరే పార్టీ పెట్టుకుంటారు: కోమటిరెడ్డి

TG: కవిత విషయంపై రేపు ఆలోచిద్దామని KCR అన్నట్లు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హరీశ్ రావు ఊరుకోరన్నారు. ఆయన వేరే పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. అయితే తాము కేసీఆర్, కవిత కుటుంబ గొడవలో తలదూర్చమని అన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని కామెంట్ చేశారు. ఇక కవిత తమ సీఎం గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
News September 2, 2025
IBM క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్

AP: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో IBM క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించేలా IBMతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. IBM రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లపాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయించనుంది.
News September 1, 2025
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.