News August 29, 2025

విశాఖలో రాష్ట్రస్థాయి తెలుగు భాషా దినోత్సవం

image

విశాఖలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు. సిరిపురంలోని వుడా బాలల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గిడుగు రామ్మూర్తి పురస్కార విజేతలను సత్కరిస్తారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Similar News

News September 1, 2025

విశాఖ: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకువాలన్నారు.

News September 1, 2025

విశాఖ: హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో నాలుగు హోంగార్డ్ పోస్టులకు సీపీ శంకబ్రత బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో కనీసం 55% మార్కులతో డిగ్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో కనీసం 55% మార్కులతో 01 సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు అప్లికేషన్ సీపీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News September 1, 2025

క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం: మంత్రి సత్యకుమార్

image

క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రమే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. విశాఖ‌లోని కేజీహెచ్‌తో పాటు ప‌లు ఆసుపత్రుల్లో అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు. ఇందుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నామ‌ని, వైద్య సిబ్బందిని నియ‌మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్‌లో క్యాన్స‌ర్ చికిత్సా కేంద్రంలో రూ.42 కోట్ల‌తో స‌మ‌కూర్చిన‌ అధునాతన యంత్రాలను ఆయన ప్రారంభించారు.