News August 29, 2025
కృష్ణా: మెగా DSC.. 95% అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

ఉమ్మడి కృష్ణా జిల్లా మెగా DSCలో మెరిట్ సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం జరిగింది. నోబుల్ కళాశాలలో 1,208 పోస్టులకు గాను, తొలిరోజు 1,048 మందికి కాల్ లెటర్లు జారీ చేశారు. 95% మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. 200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. ఆన్‌లైన్ అప్‌లోడ్ సమస్యలు, గైర్హాజరైన వారికి శుక్రవారం వెరిఫికేషన్ ఉంటుందని డిప్యూటీ DEO తెలిపారు.
Similar News
News August 29, 2025
విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి తెలుసా?

హీరో <<17551492>>విశాల్<<>>, హీరోయిన్ సాయి ధన్షిక నిశ్చితార్థం జరిగింది. TN తంజావూరుకు చెందిన ఆమె 2006లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘కబాలి’లో రజినీకాంత్ కూతురిగా కనిపించారు. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించారు. వీరిద్దరూ 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఓ సభలో ధన్షికపై కొన్ని కామెంట్స్ రావడంతో విశాల్ అండగా నిలిచారని, ఆ స్నేహం ప్రేమగా మారిందని టాక్. విశాల్, ధన్షికల వయసు 48, 35.
News August 29, 2025
కామారెడ్డి: హమ్మయ్యా.. వరుణుడు శాంతించాడు.!

మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఈరోజు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరదలు, జలమయమైన రహదారులతో కకావికలం అయిన జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉదయం నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. అధికార యంత్రాంగం పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి.
News August 29, 2025
సిరిసిల్ల: ‘ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం ఏర్పాటు’

మానేరువాగులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. చెక్, డ్యాములు, బ్రిడ్జిలు, కల్వర్టుల ప్రాంతాల్లో తనిఖీ చేయాలన్నారు.