News August 29, 2025

NTR: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సోషల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 9 లోపు విజయవాడ మారుతీనగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ప్రక్రియ, వేతన వివరాల కోసం https://ntr.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Similar News

News August 29, 2025

MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

image

SBI, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (SBI RSETY) ఆధ్వర్యంలో ఉమ్మడి MBNR జిల్లా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈరోజు తెలిపారు. ఉచిత బ్యూటిషన్, ఎంబ్రాయిడరీలకు ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలకు MBNR బండమీదిపల్లిలోని SBI RSETY సెంటర్‌లో లేదా 99633 69361, 95424 30607 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News August 29, 2025

కోటిలింగాల వినాయకుని తయారీపై చిన్నారి న్యాయపోరాటం

image

నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన కోటిలింగాల వినాయకుని ప్రతిమపై గాజువాకకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సాహితి కోర్టుకెక్కింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో బొమ్మ ఏర్పాటు చేయండంతో పర్యావరణానికి హాని కలుగుతుందని న్యాయ పోరాటానికి దిగింది. విగ్రహం తయారీ సమయంలో POPవాడొద్దని కోరినా వినకపోవడంతో లంబోదర ట్రస్ట్‌కు తండ్రి సహకారంతో కోర్టు నోటీసులు పంపింది. ట్రస్టు వారు కోటి మొక్కలు నాటాలని ఆనోటీసులో డిమాండ్ చేసింది.

News August 29, 2025

రుద్రవరంలో పర్యటించిన వ్యవసాయ నిపుణులు

image

సంతనూతలపాడు మండలం రుద్రవరంలో శుక్రవారం రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుహాసిని ఆధ్వర్యంలో పలువురు ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు పర్యటించారు. ఈ సందర్భంగా రుద్రవరం గ్రామంలో రైతు మీనమ్మ సాగు చేసిన నిమ్మ తోటను వారు సందర్శించారు. పంటలను పరిశీలించి, స్థానికంగా వ్యవసాయంపై రైతులు చూపుతున్న ఆసక్తిని వారు అభినందించారు.