News August 29, 2025
నెల్లూరు: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన శ్రీనివాసులు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేసిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.
Similar News
News August 29, 2025
గిడుగు ఆలోచనలను అర్థం చేసుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి

భవిష్యత్ తరాలకు మాతృ భాష మాధుర్యాన్ని చేరువ చేసేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హాలులో తెలుగు భాష ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గిడుగు ఆలోచనను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సూచించారు. వాడుక భాష వాడకం పెరగడంతో పాటు, మన ప్రాచీన సాహిత్యాన్ని సైతం అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని కోరారు.
News August 29, 2025
ఒంటరితనంతో మాజీ MP మేనల్లుడి ఆత్మహత్య

ఒంటరితనం భరించలేక మాజీ MP P.సుందరయ్య చెల్లెలి కుమారుడు D.చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన ఈయన ఈ ప్రైవేట్ కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. కొద్ది రోజులుగా HYDలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చి ఖమ్మం(D) మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి చనిపోయారు. డెడ్ బాడీని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
News August 29, 2025
ఆ విషయంలో నెల్లూరు జిల్లా టాప్..!

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని DGP హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మిస్సింగ్ కేసులు చేధనలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని నెల్లూరు జిల్లా పోలీసులను అభినందించారు. ప్రజలల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించి, భద్రత, భరోసా, నమ్మకంగా కలిగించేలా విధులు నిర్వహించాలని సూచించారు.