News August 29, 2025

MBNR: పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

image

స్థానిక ఎన్నికల నిర్వహన పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని గ్రామీణ ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 4,99,572 మంది ఉండగా.. పురుషులు 2,38,217, మహిళలు 2,51,344, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ జాబితా ప్రకారం మహిళా ఓటర్లే పురుషుల కంటే 3,127 మంది అధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో ఈ ఎన్నికల్లో వారి ఓట్లే ప్రాధాన్యం కానున్నాయి.

Similar News

News August 29, 2025

MBNR: కొత్తపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 85.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్జిల్ 63.3, జడ్చర్ల 34.3 మహబూబ్ నగర్ అర్బన్ 21.5, భూత్పూర్ 19.5, చిన్నచింతకుంట 13.3, కౌకుంట్ల 10.5, కోయిలకొండ మండలం పారుపల్లి 10.0, బాలానగర్ 8.5, మూసాపేట 5.8, దేవరకద్ర, హన్వాడ 3.8, మిల్లీమీటర్ల వాన పడింది.

News August 29, 2025

MBNR : క్రీడా మైదానంలోకి దిగితే.. కప్పు కొట్టాల్సిందే!

image

MBNR(D) బాలానగర్(M)లో జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను 1982 సం.లో స్థాపించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు 650 టీచర్లు, 90 PETలుగా పనిచేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయికి ఇద్దరు, రాష్ట్రస్థాయిలో 45 మంది విద్యార్థులు ఆడారు. క్రీడలకు పుట్టినిల్లుగా.. ఈ గురుకులం పేరు పొందింది. నేడు క్రీడా దినోత్సవా ఇలాంటి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News August 29, 2025

MBNR: వినాయక నిమజ్జనం.. SP పరిశీలన

image

మహబూబ్ నగర్(D) హన్వాడ(M) చిన్నదర్ పల్లి చెరువు, మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలోని పాలకొండ చెరువు, మయూరి పార్క్ ముందు గల గంగుసాయి చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి పరిశీలించారు. విగ్రహాల తరలింపు మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, చెరువుల వద్ద లైటింగ్, బారికేడింగ్, రెస్క్యూ బృందాల ఏర్పాట్లపై సమీక్షించారు. DSP వెంకటేశ్వర్లు, హన్వాడ SI వెంకటేశ్, రూరల్ SI విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.