News August 29, 2025
దివ్యాంగులకు ఉచిత పరికరాల క్యాంపు: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఉచిత పరికరాల నిర్ధారణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు. ఈ శిబిరానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల ఉపకరణాల సంస్థ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా అందించనున్నారు.
Similar News
News August 29, 2025
అవకతవకలకు పాల్పడితే స్పాట్‌లోనే సస్పెండ్: పొంగులేటి

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో యూరియా సరఫరాపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇకపై నియోజకవర్గంలో రైతులకు యూరియా ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే అందజేయాలని సూచించారు. అవకతవకలు జరిపిన వారిని స్పాట్‌లోనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అక్రమ రవాణా నివారణకు పోలీస్ బందోబస్తు, అదనపు సబ్‌సెంటర్ల ఏర్పాటు, ఆధార్, పాస్‌బుక్ ఆధారంగా ఎకరాకు ఒక బ్యాగ్ చొప్పున పంపిణీ చేయాలన్నారు.
News August 29, 2025
ADB: ‘ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర కీలకం’

సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదని, తమ వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని మాదిగ జాగృతి సంఘం జిల్లాధ్యక్షుడు ఆడేల్లు అన్నారు. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మాదిగ జాగృతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పదోన్నతులు పొందిన పలువురు ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. విధినిర్వహణలో నిబంధనలు పాటిస్తూ సమాజం మేలు కోసం కృషి చేయాలని సూచించారు.
News August 29, 2025
MBNR: బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది: మాజీ మంత్రి

కామారెడ్డి డిక్లరేషన్‌తోనే కాంగ్రెస్ గెలిచిందని, ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి, MBNR మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లు ఒక్కరూ లేరని, కాంగ్రెస్‌కి బీసీలపై మనసంతా విషమే ఉందన్నారు. కేసీఆర్ ఒక ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చారని, అంత మంది ఎంపీలు ఉన్న మీరు ఎందుకు బీసీ బిల్‌ని పాస్ చేపించడం లేదని ప్రశ్నించారు.