News August 29, 2025
ఆరిలోవ: నడిరోడ్డుపై నిప్పంటిచుకున్నాడు

విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
Similar News
News September 1, 2025
విశాఖ: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మనీ రికవరీ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకువాలన్నారు.
News September 1, 2025
విశాఖ: హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

విశాఖ కమిషనరేట్ పరిధిలో నాలుగు హోంగార్డ్ పోస్టులకు సీపీ శంకబ్రత బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో కనీసం 55% మార్కులతో డిగ్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్‌లో కనీసం 55% మార్కులతో 01 సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు అప్లికేషన్ సీపీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
News September 1, 2025
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం: మంత్రి సత్యకుమార్

క్యాన్సర్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలోని కేజీహెచ్‌తో పాటు పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నామని, వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన యంత్రాలను ఆయన ప్రారంభించారు.