News August 29, 2025
GROWW పబ్లిక్ ఇష్యూకు గ్రీన్‌సిగ్నల్

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ GROWW పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఈ IPOతో ₹6,000-₹8,500 కోట్లు సమీకరించనుంది. సంస్థ విలువను ₹60,000 కోట్లుగా లెక్కగట్టారు. IPOలో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులూ షేర్లను విక్రయిస్తారు. గ్రోలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, పీక్ XV, టైగర్ క్యాపిటల్‌కు వాటాలున్నాయి.
Similar News
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <


