News August 29, 2025
NLG: పోలీసుల అదుపులో అనుమానితులు?

నల్గొండలో యువకుడి మర్డర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. మృతుడు రమేశ్ బావ బుషిపాక వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలు తీసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 29, 2025
రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష పదవి రేసులో 20 మంది?

రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష పదవి కోసం పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతుండడంతో పార్టీకి తలనొప్పిగా మారింది. అధికార పార్టీలో అధ్యక్ష పదవి కోసం 20 మందికి పైగా పార్టీ నేతలు త్రిసభ్య కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దొమ్మలపాటి రమేష్ (మదనపల్లి ), శంకర్ యాదవ్(తంబళ్ల పల్లె ), సుగవాసి ప్రసాద్ బాబు(రాయచోటి), మేడా విజయశేఖర్ రెడ్డి (రాజంపేట) కస్తూరి విశ్వనాధ నాయుడు (రైల్వే కోడూరు) తదితరులు ఉన్నారు.
News August 29, 2025
సిరిసిల్ల: ‘చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలి’

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సిరిసిల్లలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో క్రీడల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాందాసు మాట్లాడుతూ.. క్రీడలు దేహ దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. పీడీ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
News August 29, 2025
సిరిసిల్ల: 53 మంది సెర్ప్ సిబ్బంది బదిలీ

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో హైదరాబాద్ ఆదేశాల మేరకు 53 మంది సెర్ప్ సిబ్బందిని బదిలీ చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సెర్ప్ సిబ్బందికి శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 53 మంది సెర్ప్ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చి బదిలీ చేశామని ఆయన పేర్కొన్నారు. డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ ఉన్నారు.