News August 29, 2025

లాభాల్లో మొదలైన మార్కెట్లు

image

రెండు రోజుల వరుస నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 80,209 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 24,537 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ లాభాలు కొనసాగుతాయా? లేక మళ్లీ నష్టాల్లోకి జారుకుంటాయా అనేది చూడాలి. ప్రస్తుతానికి హిందూస్థాన్ యునిలీవర్, ఏషియన్ పెయింట్స్, ITC, ట్రెంట్, కొటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Similar News

News January 2, 2026

ఇంట్లోని ఈ వస్తువులు యమ డేంజర్!

image

మనం శుభ్రంగా ఉంటాయని భావించే వస్తువులే బ్యాక్టీరియాకు అసలైన నిలయాలు. పబ్లిక్ టాయ్‌లెట్ సీటు కంటే సూపర్ మార్కెట్ <<18742127>>ట్రాలీలు<<>>, ATM & లిఫ్ట్ బటన్లపై 40 రెట్లు ఎక్కువ క్రిములుంటాయని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్స్, ఆఫీస్ కీబోర్డులు, వంటగదిలోని స్పాంజ్‌లు, రిమోట్లు ఇన్ఫెక్షన్లకు కారకాలు. వందల మంది తాకే ఈ వస్తువుల ద్వారా 80% వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని వాడాక చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్.

News January 2, 2026

PCOSతో మహిళల్లో మానసిక సమస్యలు

image

ప్రస్తుతకాలంలో పీసీఓఎస్‌తో బాధపడే మహిళల సంఖ్య పెరిగింది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పలు మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో త్వరగా మతిమరపు రావడం, డిప్రెషన్‌తో పాటు టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

News January 2, 2026

నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

image

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.