News August 29, 2025
ప్రయాణికులకు అలర్ట్..ఖుర్దా రోడ్ వరకే ఆ రైలు

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించే గుణుపూర్(GNPR)- కటక్(CTC) రైలు ఈ నెల 31న ఖుర్దా రోడ్ వరకే నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ పనులు జరుగుతున్నందున..ఈ నెల 31న నెం.68434 GNPR- CTC మెము ఖుర్దా రోడ్ వరకు, అదే విధంగా నెం.68433 CTC- GNPR మెమో కటక్‌కు బదులుగా ఖుర్దా రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.
Similar News
News September 4, 2025
రణస్థలంలో 500 ఉద్యోగాలకు జాబ్ మేళా

శ్రీకాకుళం(D) రణస్థలంలో ఈ నెల 6న 500 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఈ మేళా జరగనుందన్నారు. టెన్త్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.
News September 4, 2025
శ్రీకాకుళం: ‘బాల్యవివాహాల నివారణకు కృషి చేయాలి’

బాల్యవివాహాలు నివారణకు కృషి చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ విమల అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలోని జిల్లా సీడీపీఓ, సూపర్‌వైజర్లతో బాల్యవివాహాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు.
News September 4, 2025
శ్రీకాకుళం మీదుగా చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా చర్లపల్లి(CHZ), బ్రహ్మపుర(BAM) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం:07028 BAM- CHZ రైలును SET 6 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. నం:07027 CHZ- BAM రైలును SEPT 5 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు జిల్లాలో శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురంలో ఆగుతాయన్నారు.