News August 29, 2025
తేనెకన్నా తియ్యనిది మన తెలుగు భాష

తేనెకన్నా తియ్యనిది, పాలమీగడల కన్నా స్వచ్ఛమైనది మన భాష. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. క్రీ.పూ.400 నుంచి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగు చరిత్ర, పదకోశం చాలా గొప్పవి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పేరు గాంచింది. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతినే నేడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. తెలుగులోనే మాట్లాడదాం.. భావి తరాలకు తెలుగు భాష తియ్యదనాన్ని అందిద్దాం.
Similar News
News January 1, 2026
2026 గురించి నోస్ట్రడామస్ ఏం చెప్పారు?

ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్ 2026లో ప్రపంచం పలు విపత్తులను ఎదుర్కోనుందని అంచనా వేశారు. తాను రాసిన Les Prophéties బుక్‌లో వీటిని ప్రస్తావించారు.
1. ప్రపంచ యుద్ధ స్థాయిలో పోరాటాలు.
2. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.
3. నిర్ణయాధికారం కృత్రిమ మేధ చేతుల్లోకి. (AI ఆధిపత్యం)
4. సముద్రంలో భారీ విపత్తు లేదా ఉద్రిక్తతలు.
5. నీటి సంబంధిత ప్రకృతి విపత్తులు.
** 1566లో తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు.
News January 1, 2026
నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in
News January 1, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది 1.2 కోట్ల కొలువులు!

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.


