News August 29, 2025
KNR: గణేశ్ నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు..?

వినాయక నవరాత్రుల్లో నేడు 3వ రోజు. ఇవాళ్టి నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఉమ్మడి KNR వ్యాప్తంగా కొందరు 5, 7, 9రోజులకు నిమజ్జనం చేస్తే, మరికొందరు 11రోజులకు విఘ్నేశ్వరుడిని జలప్రవేశం చేయిస్తారు. కాగా, ఆ గణనాథుడి నిమజ్జనానికి నిర్వాహకులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. కొందరిప్పటికే మహారాష్ట్ర, HYD మర్ఫా బ్యాండ్లను బుక్ చేసుకున్నారు. మరి ఈసారి మీరు గణేశ్ నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారో COMMENT చేయండి.
Similar News
News August 29, 2025
కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 29, 2025
సిద్దిపేట: ‘ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించండి’

స్థానిక ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కె. హైమావతి కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీల్లో 4508 పోలింగు స్టేషన్లలో 1 జూలై 2025 వరకు 6,55,958 ఓటర్లు ఉన్నారన్నారు. ఈ 508 గ్రామ పంచాయతీలలో ఓటర్ లిస్టు విడుదల చేస్తామని చెప్పారు.
News August 29, 2025
వరంగల్: తహశీల్దార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

ఖిలావరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ ఆదాయానికి మించిన కేసు నమోదు చేసింది. హనుమకొండ, ఖమ్మంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.1.15 కోట్ల ఇల్లు, రూ.1.43 కోట్ల 17.10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.24 లక్షల బంగారు ఆభరణాలు, రూ.లక్ష విలువైన వెండి, రూ.35 లక్షల 2 ఫోర్ వీలర్స్, రూ.3 లక్షల విలువైన రిస్ట్ వాచెస్ సహా మొత్తం రూ.5 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.