News August 29, 2025

సురక్షిత నగరాల్లో విశాఖకు చోటు

image

దేశంలో మహిళల జీవనం, భద్రతకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, ముంబై‌లతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. మహిళల భద్రత, సురక్షిత జీవన పరిస్థితులపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ సర్వే చేసింది. మహిళలకై మౌలిక సదుపాయాలు, పోలీసింగ్, పౌరభాగస్వామ్యం ఈ నగరాల్లో ఉన్నట్లు తేలింది. దక్షిణాదిలో కేవలం విశాఖకే చోటు దక్కడం విశేషం.

Similar News

News August 29, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

News August 29, 2025

20 బంతులేసేందుకు 34,000 కి.మీ జర్నీ!

image

ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఓవల్ ఇన్విన్స్‌బుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో రాణించిన బౌలర్ రషీద్ ఖాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు లీగ్‌ను వీడారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రీప్లేస్ చేసుకుంది. కాగా జంపా ఫైనల్లో 20 బంతులు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు రానుపోను 34,000 కి.మీ ప్రయాణించనున్నారు. ఈ నెల 31న లార్డ్స్‌లో జరగబోయే ఫైనల్లో జంపా బరిలోకి దిగుతారు.

News August 29, 2025

విద్యార్థులు, టీచర్లకు ఫేషియ‌ల్ రెక‌గ్నిష‌న్ త‌ప్ప‌నిస‌రి: సీఎం రేవంత్

image

TG: స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రెక‌గ్నిష‌న్ అటెండెన్స్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని CM రేవంత్ ఆదేశించారు. ‘మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాలి. పాఠ‌శాలల‌్లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యమిచ్చి, అవసరమైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో PETలను నియమించాలి. బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సిల‌ర్ల‌ను నియ‌మించాల’ని అధికారులకు సూచించారు.