News August 29, 2025

BSNL: రూ.151తో 25 OTTలు, 450 ఛానళ్లకు యాక్సెస్

image

BSNL తన మొబైల్ కస్టమర్ల కోసం కొత్త BiTV ప్రీమియం ప్యాక్‌ను లాంచ్ చేసింది. నెలకు రూ.151 చెల్లిస్తే 25కి పైగా OTT ప్లాట్‌ఫామ్స్‌, 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ పొందొచ్చు. ఈ ప్యాక్‌లో ZEE5, SonyLIV, Shemaroo, Sun NXT, Chaupal, Lionsgate Play, Discovery+, Epic ON వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. న్యూస్, స్పోర్ట్స్, ప్రాంతీయ ఛానళ్లతో సహా అనేక లైవ్ టీవీ ఛానళ్లూ చూడొచ్చు.

Similar News

News August 29, 2025

ప్రో కబడ్డీ లీగ్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో లీగ్ మొదలైంది. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కోర్టులో కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. కాగా తొలి మ్యాచులో భాగంగా తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడుతున్నాయి.

News August 29, 2025

GDPలో భారత్ తగ్గేదేలే

image

GDPలో భారత్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్‌(ఏప్రిల్-జూన్)లో ఇండియన్ ఎకానమీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో ఇది 6.7%గా ఉంది. రియల్ జీడీపీ రూ.47.89 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. నామమాత్రపు జీడీపీ రూ.86.05 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ.79.08 లక్షల కోట్లుగా నమోదైంది.

News August 29, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.