News August 29, 2025
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి: KMR SP

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి NH-44పై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినడమే కాకుండా, నిన్న మరమ్మతులు చేసిన ప్రాంతాలు కూడా కూలిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని SP రాజేశ్ చంద్ర సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఒక లైన్ మాత్రమే అత్యవసర వాహనాలకు అందుబాటులో ఉందని, మేడ్చల్, ఆర్మూర్, నిర్మల్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News August 29, 2025
నారాయణపేట: ‘పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం’

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్‌ను ఈరోజు ఆమె ప్రారంభించారు. స్వతహాగా డాక్టర్ కావడంతో పలువురికి స్కాన్ చేసి పరిశీలించారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపై సిటీ స్కాన్ కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
News August 29, 2025
గద్వాల: కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: CITU

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ గద్వాల జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ అన్నారు. శుక్రవారం కార్మికులతో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయన్నారు. ఒప్పంద పొరుగు సేవల పేరుతో చేస్తున్న కార్మికుల శ్రమ దోపిడీని ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
News August 29, 2025
ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం

ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దీనివల్ల యూనివర్సిటీ పరిధిలో ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) డిగ్రీ కోర్సులు, అలాగే ఒక సంవత్సర డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయని వీసీ గంగాధర్ తెలిపారు.