News August 29, 2025
విశాఖలో బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా..

విశాఖ ఫోర్త్ పోలీస్ స్టేషన్ హైవే వద్ద శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారులతో ఆమె మాట్లాడారు.
Similar News
News August 29, 2025
సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికే రుషికొండ సందర్శన: రాజు

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సచివాలయ భవనాలకు ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటుకే రుషికొండ భవనాలు నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణపై చిత్తశుద్ధి ఉంటే శనివారం జరిగే జనసేన సభలో తీర్మానం చేయాలన్నారు.
News August 29, 2025
సహాయక చర్యలు వేగవంతం: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశామని, సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ముంపునకు గురైన జీఆర్ కాలనీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు వేడి ఆహారం, సురక్షితమైన తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
News August 29, 2025
VZM: 69 ఎకరాల్లో ఆక్వా సాగుకు అనుమతి

జిల్లాలో ప్రస్తుతం 200 ఎకరాల్లో ఆక్వా సాగు అవుతున్నదని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆక్వాకల్చర్ సాగు జిల్లాలో విస్తృతం చేయు నిమిత్తం గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 69 ఎకరాలకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆక్వా సాగుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగింది. ఆక్వా సాగుకు అనువైన మండలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు.