News August 29, 2025

రాజన్న ఆలయ ఈవోగా రమాదేవి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఎల్.రమాదేవి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న రమాదేవి.. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపినట్లు సమాచారం.

Similar News

News August 29, 2025

రామగిరి: సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

image

రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. 283 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, ప్లాట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని సింగరేణి సీ అండ్ ఎండీని ఫోన్‌లో ఆదేశించారు. అంతేకాక, ప్లాట్ల పనులు వెంటనే ప్రారంభించాలని మంథని ఆర్డీఓను ఆదేశించారు.

News August 29, 2025

మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

image

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.

News August 29, 2025

MBNR: ముగిసిన పీజీ పరీక్షలు.. 1,113 మంది హాజరు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం రెగ్యులర్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు నేటితో ముగిశాయి. పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ నాగం కుమారస్వామి పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ పరిధిలో 1,196 మంది విద్యార్థులకు గాను 1,113 మంది హాజరయ్యారని, 83 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.కే.ప్రవీణ తెలిపారు.