News August 29, 2025
ఆదిత్యుని ఆలయం మూసివేత

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున స్వామి వారికి నిత్యార్చనాలు, నివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయాన్ని మూసివేసి, 8న ఉదయం తెరిచి సంప్రోక్షణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉ. 7:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.
Similar News
News August 30, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

నరసన్నపేట: సాఫ్ట్ వేర్ టూ సినీ ఫీల్డ్
సంతబొమ్మాళిలో ఇద్దరిని కాటేసిన పాము
విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా నిలవాలి: రామ్మోహన్
జిల్లాలో పలు చోట్ల తెలుగు భాషా దినోత్సవం
లావేరులో 8 బైక్‌లు సీజ్
విద్యుత్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
సోంపేట: బస్సు దిగుతూ జారిపడి హెచ్ఎం మృతి
ఎల్.ఎన్ పేట: జడ్పీ ఉన్నత పాఠశాలలో దొంగల హాల్‌చల్
ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
News August 29, 2025
సాఫ్ట్‌వేర్ టూ సినీ ఫీల్డ్.. నరసన్నపేట యువకుడి విజయ గాథ

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నరసన్నపేట(M) కోమర్తికి చెందిన అట్టాడ సృజన్ నిరూపించారు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాలపై మక్కువతో డైరెక్టర్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆనంద్ దేవకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాకు కథ రాయడంతోపాటు దర్శకత్వం వహించారు. తన డైరెక్షన్‌లో ఇటీవల విడుదైన ‘కన్యాకుమారి’ సినిమాలో శ్రీకాకుళం అందాలను చాలా బాగా చూపించారు. సృజన్ తండ్రి అట్టాడ అప్పలనాయుడు ప్రముఖ కవి.
News August 29, 2025
విద్యుత్ అధికారులతో సమీక్షించిన మంత్రి అచ్చెన్న

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమీక్ష జరిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నారు. కరెంటు సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.