News August 29, 2025

ఏడు పదుల వయసులో పద్యానికి ప్రాణం పోస్తూ

image

తెలుగు భాషను బతికించి భావితరాలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో 76 వయసులో గుంటూరుకు చెందిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ తనదైన శైలిలో సేవ చేస్తున్నారు.’తెలుగు కావ్య మథనం” పేరుతో వాట్సప్ గ్రూప్‌ ఏర్పాటు చేసి పద్యరచనపై శిక్షణ ఇస్తున్నారు. 2019 నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, వ్యాపారాల్లో ఉన్న భాషాభిమానులంతా సభ్యులుగా చేరారు. 2025లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

Similar News

News September 2, 2025

సుల్తానాబాద్: ‘భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

image

PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బషిరుద్దిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 2, 2025

అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు: రాంచందర్ రావు

image

TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

News September 2, 2025

అలంపూర్ ఆలయాలతో వైఎస్సార్‌కు అనుబంధం

image

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అలంపూర్ ఆలయాలతో మంచి అనుబంధం ఉందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. 2008లో జరిగిన తుంగభద్ర పుష్కరాల సందర్భంగా అలంపూర్‌కు వచ్చిన వైఎస్సార్, జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చూపించిన భక్తి, ఈ ప్రాంతంపై ఉన్న అభిమానం ఆయన అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.