News August 29, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.650 ఎగబాకి రూ.94,700 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News September 4, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.
News September 4, 2025
బెస్ట్ లెక్చరర్స్‌కు అవార్డుల ప్రకటన

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్‌గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <
News September 4, 2025
సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.