News August 29, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాడబలిజ మత్స్యకారులు, ప్రమాద బాధితులు, ఉద్యోగం కోరిన దివ్యాంగులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక సమస్యలు వివరించిన పౌరుల అభ్యర్థనలను విని మంత్రి స్పందించారు.

Similar News

News August 29, 2025

క్రీడాకారులకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా: మంత్రి లోకేశ్

image

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఇవ్వనున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత మహిళా క్రికెటర్లతో నిర్వహించిన ముఖాముఖీలో మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడల్లో బాలికలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.‌ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌ల కొరత ఉందన్నారు.‌ 43 వేల పాఠశాలలు ఉన్నా తగినంతమంది పీఈటీలు లేరన్నారు.

News August 29, 2025

పిల్లలను యూట్యూబ్, పబ్జిలకు దూరంగా ఉంచాలి: లోకేశ్

image

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతిని సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశాల్లో క్రీడల అభివృద్ధిపై చర్చిస్తున్నామన్నారు.‌ పిల్లలను యూట్యూబ్, పబ్జీలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు.

News August 29, 2025

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికే రుషికొండ సందర్శన: రాజు

image

సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సచివాలయ భవనాలకు ఇచ్చిన రేటు కంటే తక్కువ రేటుకే రుషికొండ భవనాలు నిర్మించామన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణపై చిత్తశుద్ధి ఉంటే శనివారం జరిగే జనసేన సభలో తీర్మానం చేయాలన్నారు.