News August 29, 2025

HYD: హైడ్రా చర్యలను కొనియాడిన హై కోర్టు

image

రోడ్ల ఆక్రమణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ప్రయత్నాలను హై కోర్టు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి కొనియాడారు. రాంనగర్ క్రాస్‌రోడ్స్ వద్ద రోడ్ల ఆక్రమణలపై దాఖలైన PIL విచారణ సందర్భంగా ప్రజా రోడ్లు, పార్కులను కాపాడటంలో హైడ్రా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు.

Similar News

News September 4, 2025

HYD: ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్

image

మనం ఆరోగ్యంగా ఉండడానికి పాలు, గుడ్లు, మాంసం అవసరం లేదని గాంధీ దర్శన్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్‌ గొల్లనపల్లి ప్రసాద్‌ తెలిపారు. శరీర పోషణ కోసం జంతువులు, వాటి ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందుకే జంతువులపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్‌ పేరుతో శిల్పారామం నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 4, 2025

పాతబస్తీ మెట్రో పనుల కోసం వేగంగా చర్యలు: MD

image

పాతబస్తీ మెట్రో కోసం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు MD NVS రెడ్డి తెలిపారు. ఓవర్ హెడ్ విద్యుత్ తీగలను తొలగించి భూగర్భ కేబుల్స్ వేస్తామన్నారు. ఇప్పటికే కొంత మేరకు ఆస్తులకు నష్టపరిహారం చెల్లించడం పూర్తయిందని చెప్పారు. కరెంట్ స్తంభాలకి మధ్య 25 మీటర్ల దూరం ఉండేలా స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

News September 4, 2025

HYD: ‘HMWSSB పేరిట FAKE మెసేజెస్ నమ్మకండి’

image

సైబర్ నేరగాళ్లు HMWSSB పేరుతో హైదరాబాద్‌లో వినియోగదారులకు వాట్సప్ మెసేజెస్ పంపిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వస్తున్న మెసేజెస్ అన్నీ ఫేక్ అని జలమండలి తెలిపింది. వేరే నంబర్లను కాంటాక్ట్ చేయమని, లింక్ ఓపెన్ చేయమని, పార్సల్ చేయమని, డబ్బు పే చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని హెచ్చరించింది. జలమండలి ఎప్పుడూ వాట్సప్ ద్వారా ఏమీ పంపదని స్పష్టం చేసింది.